తెలుగు కవితలు

శుభోదయం

దరి చేరని నక్షత్రమా...

పగలు కనపడని ఓ చంద్రబింబమా...

సూరీడు కాంతి వలె ప్రకాశించే ఓ మణిరత్నమా...

తియ్యని గొంతు తో పలుకరించే ఓ కోయిలమ్మా...

అందుకోవమ్మా ఈ మిత్రుడి శుభోదయ శుభాకాంక్షలు.

శుభ సాయంకాలం

సూరీడు అస్తమిస్తున్న వేళ...

పక్షులు తమ గూటికి చేరుతున్న వేళ...

సన్నజాజి విరబూస్తున్న వేళ...

చందమామ మబ్బుల చాటున వుండి తొంగి చూస్తున్న వేళ...

నా మిత్రుడికి సాయంకాల నమస్సుమాంజలి...