Bilingual Poetry

Telugu Poems in English

“Discover the soul of Telugu poetry through the melody of English words.”

ONTARITNAM…

English transliteration
Kani penchaalsina tallidandrulu vadileste — adi ontaritnam… Andaga nilavalsina annadammulu, akkachellalu dooramaite — adi ontaritnam… Aatapaatalatho navvulu panche snehitulu venutirigite — adi ontaritnam… Aapadalo aadukovalsina bandhuvulu kanabadakapote — adi ontaritnam… Jeevitam antha toduga undalsina jeevanasahachari vidichipedithe — adi ontaritnam… Vruddhaapyamlo reppala kapadatamani anukunna pillalu dooramaite — adi ontaritnam… Chivari prayanamlo kooda chayutha ivvalsina naluguru tirigi saagipoyina — adi ontaritname… Evaru neeku toduga untaru? Enduku nee kosamai aalochistaru? Andari kosam aalochinchadam maaneyyi… Nee jeevitam kosamai kanisam okka adugu aina munduku veyyi… Aa kshnanam ninnu vadulukunna andaru “ontari vallu” avutaaru… Jeevita satyam telisina nuvvu aanandudivi avutaavu…

ఒంటరితనం…

తెలుగు
కని పెంచాల్సిన తల్లిదండ్రులు వదిలేస్తే—అది ఒంటరితనం… అండగా నిలవాల్సిన అన్నదమ్ములు, అక్కచెల్లెలు దూరమైతే—అది ఒంటరితనం… ఆటపాటలతో నవ్వులు పంచే స్నేహితులు వెనుతిరిగితే—అది ఒంటరితనం… ఆపదలో ఆదుకోవాల్సిన బంధువులు కనబడకపోతే—అది ఒంటరితనం… జీవితం అంతా తోడుగా ఉండాల్సిన జీవనసహచరి విడిచిపెడితే—అది ఒంటరితనం… వృద్ధాప్యంలో రెప్పలా కాపాడతామని అనుకున్న పిల్లలు దూరమైతే—అది ఒంటరితనం… చివరి ప్రయాణంలో కూడా చేయూత ఇవ్వాల్సిన నలుగురూ తిరిగి సాగిపోయినా—అది ఒంటరితనమే… ఎవరు నీకు తోడుగా ఉంటారు ఎందుకు నీ కోసమై ఆలోచిస్తారు? అందరి కోసం ఆలోచించడం మానెయ్యి.... నీ జీవితం కోసమై కనీసం ఒక్క అడుగు అయినా ముందుకు వెయ్యి... ఆ క్షణం నిన్ను వదులుకున్న అందరూ "ఒంటరి వాళ్ళు" అవుతారు... జీవిత సత్యం తెలిసిన నువ్వు ఆనందుడివి అవుతావు...

O CHILAKAMMA…

English transliteration
Prathi bandhamlo prema anedi undadamma O chilakamma… Aapyaata leni premaki Peru undadu o chilakamma… Prashanthata leni praanam unna Adi nirupayogam o chilakamma… Ekkada aasha untundo Akkade korika kooda untundi o chilakamma… Aa devudu raasina talaraatani Eppatiki cherpi veyalevu o chilakamma… Anduke dhairyam tho Munduku nadavaali o chilakamma… Nalugurilo navvutuu Bratakali o chittemma…

ఓ చిలకమ్మా…

తెలుగు
ప్రతి బంధంలో ప్రేమ అనేది ఉండదమ్మా ఓ చిలకమ్మా… ఆప్యాయత లేని ప్రేమకి పేరు ఉండదు ఓ చిలకమ్మా… ప్రశాంతత లేని ప్రాణం ఉన్నా అది నిరుపయోగం ఓ చిలకమ్మా… ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడే కోరిక కూడా ఉంటుంది ఓ చిలకమ్మా… ఆ దేవుడు రాసిన తలరాతను ఎప్పటికీ చేర్పివేయలేవు ఓ చిలకమ్మా… అందుకే ధైర్యంతో ముందుకు నడవాలి ఓ చిలకమ్మా… నలుగురిలో నవ్వుతూ బ్రతకాలి ఓ చిట్టెమ్మా…

JEEVITAM

English transliteration
Eppudu mugustundo, ela mugustundo teliyanidi jeevitam… Baadhale teliyani baalyamlo aata paatalatho allari chese amaayakathvanni istundi jeevitam… Jnyaanam ane sampadanu, aapadalo andaga niliche aaptha mitrulani istundi jeevitam… Oohallo telae kalalanu, manasuni dochi maimaripinche premaku ruchini choopistundi jeevitam… Kashta–sukhalalo paalu panchukoni, kaati varaku todundae manasuni istundi jeevitam… Raktam panchukuni allari muddu maatalaatho chiru navvuni panche bandhalani istundi jeevitam… Baruvulu moyyache baadhyatalanu, kaalamtho parigettype paristhitulu kooda kalpistundi jeevitam… Nammivaaru chese nammakadrohanni, panchapraanalu anukunna vaari kapata mosanni choopistundi jeevitam… Evari kosam chesinaa, emi chesinaa, entha chesinaa… chivariki nuvvu ekaakivi ane satyanni nerpistundi ee jeevitam… Gamyam ekkado teliyani anthuleni prayaname mana jeevana yaanam…

జీవితం

తెలుగు
ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో తెలియనిది జీవితం... బాధలు తెలియని బాల్యంలో ఆటపాటలతో అల్లరి చేసే అమాయకత్వాన్ని ఇస్తుంది జీవితం… జ్ఞానం అనే సంపదను, ఆపదలో అండగా నిలిచే ఆప్త మిత్రులని ఇస్తుంది జీవితం… ఊహల్లో తేలే కలలను, మనసును దోచి మైమరిపించే ప్రేమను రుచి చూపిస్తుంది జీవితం… కష్టం–సుఖాల్లో పాలు పంచుకుని, కాటి వరకు తోడుండే మనసును ఇస్తుంది జీవితం… రక్తం పంచుకుని అల్లరి ముద్దు మాటలతో చిరు నవ్వుని పంచే బంధాలనీ ఇస్తుంది జీవితం... బరువులు మోయించే బాధ్యతలను, కాలంతో పరిగెత్తించే పరిస్థితులను కూడా కల్పిస్తుంది జీవితం… నమ్మినవాళ్ల చేత జరిగే నమ్మకద్రోహాన్ని, పంచప్రాణాలు అనుకున్న వారి కపటమోసాన్ని చూపిస్తుంది జీవితం… ఎవరి కోసం చేసినా, ఏమి చేసినా, ఎంత చేసినా… చివరికి నువ్వు ఏకాకివి అనే సత్యాన్ని నేర్పిస్తుంది ఈ జీవితం... గమ్యం ఎక్కడో తెలియని అంతులేని ప్రయాణమే మన జీవనయానం…

GAMYAM

English transliteration
O gamyam leni manishi... Pakshini kaavu kaani prayanistunnavu ee anantha prapanchamlo… Chepavu kaavu kaani edureedutunnavu ee samsaram ane saagaramlo… Joker vi kaavu andarini navvistunnavu nee chilipi maatlatho... Mayagaadivi kaavu kaani manthramugdhulanu chestunnavu nee aata paatalatho… Andari kosam alochistoo, andariki jeevistoo vunde... Nee prathi gamanam vijayani cheralaani korukuntu nee priya mitrudu...

గమ్యం

తెలుగు
ఓ గమ్యం లేని మనిషి... పక్షిని కావు కానీ ప్రయాణిస్తున్నావు ఈ అనంత ప్రంపంచంలో… చేపవు కావు కానీ ఎదురీదుతున్నావు ఈ సంసారం అనే సాగరంలో… జోకర్‌వి కావు అందరిని నవ్విస్తున్నావు నీ చిలిపి మాటలతో... మాయగాడివి కావు కానీ మంత్రముగ్ధులను చేస్తున్నావు నీ ఆట, పాటలతో… అందరి కోసం ఆలోచిస్తూ, అందరికి జీవిస్తూ వుండే… నీ ప్రతి గమనం విజయాన్ని చేరాలని కోరుకుంటూ నీ ప్రియ మిత్రుడు...

MANISHI O MANISHI…

English transliteration
Premikula roju puvvu ichi “Prema” antavu… Coffee shop lo naalugu maatlu cheppi “Naa sarvasvam” antavu… Amma kanna andamga unnanu antavu… Mobile lo chat chestoo muddu antavu… Cinema ki teesukelli cheyi vestavu… Hotel ki teesukelli happy gaa gadupudam antavu… Pelli ante matram nannu sarigga artham chesukoledhu antavu… IDENAA PREMANTE…?

మనిషి ఓ మనిషి…

తెలుగు
ప్రేమికుల రోజు పువ్వు ఇచ్చి “ప్రేమ” అంటావు… కాఫీ షాప్‌లో నాలుగు మాటలు చెప్పి “నా సర్వస్వం” అంటావు… అమ్మ కన్నా అందంగా ఉన్నావు అంటావు… మొబైల్‌లో చాట్ చేస్తూ ముద్దు అంటావు… సినిమాకు తీసుకెళ్లి చేయి వేస్తావు… హోటల్‌కు తీసుకెళ్లి హ్యాపీగా గడుపుదాం అంటావు… పెళ్ళి అంటే మాత్రం నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని అంటావు… ఇదేనా ప్రేమంటే…?

O naa mitramaa...

English transliteration
Asthaminche sooreedu velugutho udayaanne udayisthaadu... Prodduna kanipinchani aa jaabilli saayankaalamlo prakaasisthaadu... Vaadipoyina chettu varshamtho marusati rojuna malli viraboostundi... Enda kaalamlo endipoyina vaagu vaana kaalamlo parigedutundi... Alaage... Kanapadananta dooranga unna O naa mitramaa... Gathi thappina prathi jeevi gamananki marala oka manchi roju vasthundi.....

ఓ నా మిత్రమా...

తెలుగు
అస్తమించే సూరీడు వెలుగుతో ఉదయాన్నే ఉదయిస్తాడు... ప్రొద్దున కనిపించని ఆ జాబిల్లి సాయంకాలంలో ప్రకాశిస్తాడు... వాడిపోయిన చెట్టు వర్షంతో మరుసటి రోజున మళ్లీ విరబూస్తుంది... ఎండ కాలంలో ఎండిపోయిన వాగు వాన కాలంలో పరిగెడుతుంది... అలాగే... కనపడనంత దూరంగా ఉన్న ఓ నా మిత్రమా... గతి తప్పిన ప్రతి జీవి గమనానికి మరలా ఒక మంచి రోజు వస్తుంది.....

CELL PHONE

English transliteration
Manishini tayaru chesina ee cell phone... Manishine mattuloki laagesindi ee smart phone... Bathroom loki kuda vachesindi ee cell phone... Bhaarya bhartha lani kooda vidadeestundi ee smart phone... Bhojana tappudu kuda disturb chestundi ee cell phone... Thana vaarini saitham lekunda chestundi ee smart phone... Akhila prapanchanni arachethilo aavishkarinche ee cell phone… Oka selfie kosam praanalake panam pettinche ee smart phone… Khandaala dooranunna hrudayalanu daggara chese ee cell phone… Pakkane unna premanu dooram chese ee smart phone…

సెల్ ఫోన్

తెలుగు
మనిషిని తయారు చేసిన ఈ సెల్ ఫోన్... మనిషినే మత్తులోకి లాగేసింది ఈ స్మార్ట్ ఫోన్... బాత్రూమ్‌లోకి కూడా వచ్చేసింది ఈ సెల్ ఫోన్... భార్య భర్తల్ని కూడా విడదీస్తుంది ఈ స్మార్ట్ ఫోన్... భోజన సమయంలో కూడా డిస్టర్బ్ చేస్తుంది ఈ సెల్ ఫోన్... తన వారిని సైతం లేకుండా చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్... అఖిల ప్రపంచాన్ని అరచేతిలో ఆవిష్కరించే ఈ సెల్ ఫోన్… ఒక సెల్ఫీ కోసం ప్రాణాలకే పణం పెట్టించే ఈ స్మార్ట్ ఫోన్… ఖండాల దూరానున్న హృదయాలను దగ్గర చేసే ఈ సెల్ ఫోన్… పక్కనే ఉన్న ప్రేమలను దూరం చేసే ఈ స్మార్ట్ ఫోన్…

Corona

English transliteration
Kadilē prapanchanni kudipestunna O corona... Aarogyame mahaabhagyam anna naanudini manushulaku gurtu chestunna O corona... Aanandam pabbullo aadite raadu, intlo pillalatho aadukondi ani chebuthunna O corona... Nenu Bharata maata muddu biddani ani pravaasa bhaarateeyulaki gunapaatham chebuthunna O corona... Technology ani virra veeguthunna vaallani intlo koorchobettina O corona... Srushtini shaasinchalerani science ke savaalu visirina O corona... Gauravam ante hug lo kaadu, kiss lo kaadu vinaya poorvaka namaskaaram 🙏 lo untundani ani prapanch adhyakshulaki chaati cheppina guru O corona... Gudilo yaagaalu, church lo praarthanaalu maatrame kaadu kaavaalsindi, Manushullo maarpu ani sandeshamistunna O corona... Aapavaa ika naina nee maarana homaanni...

కరోనా

తెలుగు
కదిలే ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఓ కరోనా... ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని మనుషులకు గుర్తు చేస్తున్న ఓ కరోనా... ఆనందం పబ్బుల్లో ఆడితే రాదు, ఇంట్లో పిల్లలతో ఆడుకొండి అని చెబుతున్న ఓ కరోనా... నేను భరతమాత ముద్దు బిడ్డని అని ప్రవాస భారతీయులకి గుణపాఠం చెబుతున్న ఓ కరోనా... Technology అని విర్ర వీగుతున్న వాళ్ళని ఇంట్లో కూర్చో బెట్టిన ఓ కరోనా... సృష్టిని శాసించలేరని science కె సవాలు విసిరిన ఓ కరోనా... గౌరవం అంటే hug లో కాదు, kiss లో కాదు వినయం పూర్వక నమస్కారం 🙏 లో ఉంటుందని అని ప్రపంచ అధ్యక్షులకి చాటి చెప్పిన గురువు ఓ కరోనా... గుడిలో యాగాలు, చర్చి లో ప్రార్ధనలు మాత్రమే కాదు కావాల్సింది, మనుషుల్లో మార్పు అని సందేశమిస్తున్న ఓ కరోనా... ఆపవా ఇక నైనా నీ మారణ హోమాన్ని ...

Muggulu

English transliteration
Rangu rangula ee muggulu… Telugu vaari pandugalaku prateekalu ee muggulu… Inti vaakili ni indradhanassulaa chese andaalu ee muggulu… Sakala devata moorthulani intiki teesukoni vacche ratha saarathulu ee muggulu… Ammayila srujanatmakatanu choopinche adbhutalu ee muggulu… Alanti ee muggulaki praanam posthunna o Bharata naari neeku ive naa vandanaalu.

ముగ్గులు

తెలుగు
రంగు రంగుల ఈ ముగ్గులు… తెలుగు వారి పండుగలకు ప్రతీకలు ఈ ముగ్గులు… ఇంటి వాకిలి ని ఇంద్రధనస్సులా చేసే అందాలు ఈ ముగ్గులు… సకల దేవతామూర్తులని ఇంటికి తీసుకొని వచ్చే రథ సారథులు ఈ ముగ్గులు… అమ్మాయిల సృజనాత్మకతను చూపించే అద్భుతాలు ఈ ముగ్గులు… అలాంటి ఈ ముగ్గులకి ప్రాణం పోస్తున్న ఓ భారతనారి నీకు ఇవే నా వందనాలు.

Ugadi

English transliteration
Raamulo Raamulo Ugadi pandaga vacchesindiro… Raamulo Raamulo manaku Telugu samvatsaranni techchesindiro… Kotta battalu konukkoni, devuni poojalu chesukoni… Ugadi pachchadi tinte untadhiro o chandamama, corona kooda paari pothundi o chandamama… Aaru ruchula pachchadi taagaro o chandamama, noorellu santoshanga jeevincharo o chandamama… Sri Sharvari naama samvatsaramlo o chandamama, neeku elanti vighnaalu undakoodaduro o chandamama… Raamulo Raamulo Ugadi pandaga vacchesindiro… Raamulo Raamulo manaku Telugu samvatsaranni techchesindiro…

ఉగాది

తెలుగు
రాములో రాములో ఉగాది పండగ వచ్చేసిందిరో… రాములో రాములో మనకు తెలుగు సంవత్సరాన్ని తెచ్చేసిందిరో… కొత్త బట్టలు కొనుక్కోని, దేవుని పూజలు చేసుకొని… ఉగాది పచ్చడి తింటే ఉంటధిరో ఓ చందమామ, కరోనా కూడ పారి పోతుంది ఓ చందమామ … ఆరు రుచుల పచ్చడి తాగరో ఓ చందమామ, నూరేళ్లు సంతోషంగ జీవించరో ఓ చందమామ ... శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఓ చందమామ, నీకు ఎలాంటి విఘ్నాలు ఉండకూడదురో ఓ చందమామ... రాములో రాములో ఉగాది పండగ వచ్చేసిందిరో… రాములో రాములో మనకు తెలుగు సంవత్సరాన్ని తెచ్చేసిందిరో…

Stree

English transliteration
Prapanchamlo ye jeeviki aina pranam pose amma oka stree... Samasta jeeva kotini tana bhujalapai mostunna Bhoodevi oka stree... Paamarudini panditudini chese Saraswati devi oka stree... Kucheludini kooda Kuberudini chese Lakshmi devi oka stree... Andariki annam pette aa Annapoorna oka stree... Tana raktanni paalaga maarchi tana pillala aakali teerchedi oka stree... Tallidandrulu, bharta, pillala santoshalanu tana aanandanga jeevinchedi oka stree... Alanti streenni poojinchu, tanaki rakshanaga tooduga jeevinchu...

స్త్రీ

తెలుగు
ప్రపంచంలో ఏ జీవికి అయినా ప్రాణం పోసే అమ్మ ఒక స్త్రీ... సమస్త జీవ కోటిని తన భుజాలపై మోస్తున్న భూదేవి ఒక స్త్రీ... పామరుడిని పండితుడిని చేసే సరస్వతి దేవి ఒక స్త్రీ... కుచేలుడిని కూడా కుబేరుడిని చేసే లక్ష్మి దేవి ఒక స్త్రీ... అందరికీ అన్నం పెట్టే ఆ అన్నపూర్ణ ఒక స్త్రీ... తన రక్తాన్ని పాలగా మార్చి తన పిల్లల ఆకలి తీర్చేది ఒక స్త్రీ... తల్లిదండ్రులు, భర్త, పిల్లల సంతోషాలను తన ఆనందంగా జీవించేది ఒక స్త్రీ... అలాంటి స్త్రీని పూజించు, తనకి రక్షణగా తోడుగా జీవించు...

Prapancham

English transliteration
Prapancham ante pradesaalu kaadu, prapancham ante mana chuttuu unna bandhaalu, anubandhaalu... Nuvvu anukunte chinnaari navvule nee prapancham... Talli tandrula seve nee prapancham... Ardhaangini ardham chesukovadame nee prapancham... Praanam icche snehitudini sampaadinchadame nee prapancham... Maanava seve Maadhava seva ga jeevinchadam nee prapancham... Pancha bhootaalanu poojinchadam nee prapancham... Prapancham ante pradesaalu kaadu, prapancham ante mana chuttuu unna bandhaalu, anubandhaalu...

ప్రపంచం

తెలుగు
ప్రపంచం అంటే ప్రదేశాలు కాదు ప్రపంచం అంటే మన చుట్టూ ఉన్న బంధాలు, అనుబంధాలు... నువ్వు అనుకుంటే చిన్నారి నవ్వులే నీ ప్రపంచం... తల్లి తండ్రుల సేవే నీ ప్రపంచం... అర్థాంగిని అర్థం చేసుకోవడమే నీ ప్రపంచం... ప్రాణం ఇచ్చే స్నేహితుడిని సంపాదించడమే నీ ప్రపంచం... మానవ సేవే మాధవ సేవగా జీవించడం నీ ప్రపంచం... పంచ భూతాలను పూజించడం నీ ప్రపంచం... ప్రపంచం అంటే ప్రదేశాలు కాదు ప్రపంచం అంటే మన చుట్టూ ఉన్న బంధాలు, అనుబంధాలు...