వనితా… ఓ వనితా…
"సంతాన లక్ష్మీ" లా
సమస్త మానవజాతికి జన్మనిస్తున్నావు…
"ధాన్య లక్ష్మీ"లా
ఆ జనాలకి తినడానికి ఆహారాన్ని ఇస్తున్నావు ...
"విద్యా లక్ష్మీ"లా
జ్ఞానాన్ని అందించి జీవనానికి కొత్త దారులు చూపుతున్నావు…
"ధన లక్ష్మి" లా
సంపద కోసం కష్టపడేలా చేసి
మనిషిలోని సోమరితనాన్ని దూరం చేస్తున్నావు…
"ధైర్య లక్ష్మీ" లా
ఓడిపోయిన మనిషికి నిలబడడానికి
అవసరమైన ధైర్యాన్ని నింపుతున్నావు…
"విజయ లక్ష్మి" లా
ధైర్యంగా ముందుకు సాగుతున్న ప్రతి మనిషికి
విజయాన్నే వరముగా అందిస్తున్నావు…
"గజ లక్ష్మీ" లా
మంచి చేస్తూ నడిచే వ్యక్తికి
తోడుగా, అండగా నిలుస్తున్నావు…
"ఆది లక్ష్మీ" లా
నిన్ను గౌరవించే, మంచి చేసే వ్యక్తికి
అష్టైశ్వర్యాలు ఇచ్చి
దైవం పై ఉన్న నమ్మకం వమ్ము కాకుండా చూస్తున్నావు …
ఇలా ---
మనిషి మనుగడకి
అన్ని రూపాలలో ఉండే
ఆ మహత్తర స్త్రీ శక్తి నీవే కదా…
వనితా… ఓ వనితా…